హుజూరాబాద్ సభలో కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఈటల రాజేందర్...ఏ జాతీయ పార్టీ ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇవ్వనప్పుడు బీజేపీ పార్టీ ముందుకొచ్చిందని అన్నారు. 2009లోనే ప్రధాని మోడీ తెలంగాణకు సపోర్ట్ చేశాడన్నారు. తెలంగాణ చిన్నమ్మగా పిలువబడిన సుష్మాస్వరాజ్ సేవలను గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఆనాడే ఎదిరించినట్లు ఈటల వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీకి మరోషాక్ తగిలింది. పటాన్‌చెరువు కీలక నేత నీలంమధు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత 10 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నప్పటికీ గుర్తింపు ఇవ్వలేదని నీలంమధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మధు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన హామీలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని.. రాష్ట్ర రెవిన్యూలో 20 శాతం వడ్డీలకే పోతుందన్నారు.
చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు నిర్వహించే న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని నారా లోకేష్, బ్రహ్మణి, భువనేశ్వరి కోరారు. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 7 నుంచి 7.05 నిమిషాల సమయంలో చేతులకు రిబ్బన్ లేదా గుడ్డను కట్టుకుని ఈ నిరసనలో పాల్గొనాలని పేర్కొన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఓ గిఫ్ట్ పంపించారు. గులాబీ రంగులో ఉన్న విలాసవంతమైన ఎన్నికల ప్రచార రథాన్ని హైదరాబాద్ కు కేసీఆర్ కోసం పంపించారు. ఇది చూసిన పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలో లక్షలమంది విద్యార్థులు, ఉద్యోగార్థుల జీవితాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే కేసీఆర్ ను గద్దె దింపాలని అన్నారు.
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ.. ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు.
ఇటివల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy) జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) పెళ్లిళ్ల గురించి మళ్లీ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) స్పందించారు. సీఎం ఎప్పుడు చుసినా పవన్ వ్యక్తిగత విషయాలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలా దిగజారి మాట్లాడుతున్న సీఎంకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ధీమ...
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు పలు రకాల వ్యూహరచన చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జైపూర్లోని ఓ భవనంలో 100 లాకర్లలో 500 కోట్ల రూపాయల నల్లధనం, 50 కేజీల గోల్డ్ ఉందని బీజేపీ ఎంపీ ఆరోపించారు. అంతేకాదు ఆ లాకర్ ఓపెన్ చేయాలని ఆ భవనం వద్ద కూర్చుని డిమాండ్ చేశారు.
సనత్ నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సరికొత్త ఆఫర్ ఇచ్చారు. బానిస బతుకు వద్దని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెల్వలేదన్నారు. ఈ క్రమంలో తన పార్టీలో చేరాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపేందుకు కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యాలు చేయగా..వీటిపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎక్కడైనా అలా చేశారా అంటూ గంగులను ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు హైదరాబాద్ మెట్రోలో నల్ల టీషర్ట్‌లు ధరించి నిరసనలు చేయనున్నారు. 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' అనే ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు.
ఆరు నెలల కిందట వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగా..రాజాసింగ్ పోటీపై రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బుధవారం సాయంత్రం నారా లోకేష్(Nara Lokesh) కలిశారు. ఆ క్రమంలో తన తండ్రి చంద్రబాబు నాయుడుకు ప్రాణహాని ఉందని షా(amit shah)తో ప్రస్తావించారు. దీంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించినట్లు వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబు ఉన్నది వెల్‌నెస్ సెంటర్లో కాదని జైల్లో ఉన్నారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. దోమలు కుడుతున్నాయి, డీహైడ్రేషన్ అంటూ సింపతీ కోసం ట్రైచేయొద్దని ఎద్దేవా చేశారు. ఇక లోకేశ్ చేసింది తప్పని త్వరలోనే అతనికి కూడా శిక్ష పడుతుందని గుడివాడ అభిప్రాయం వ్యక్తం చేశారు.