వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల చేరడం వెనుక కుట్ర ఉందని సజ్జల ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు మారుతున్నారు. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగింది.
Breaking News: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల పార్టీలోకి చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించాడు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న.. అందుకే పార్టీని వీడుతున్నానని తెలిపాడు. డిసెంబర్ 28న అంబటి రాయుడు వైసీపీలో చేరారు. స్వయంగా సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారం రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో సంచలనం క...
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో కోట్ల డబ్బును అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ హర్యానా, పంజాబ్‌లో దాడులు నిర్వహిస్తున్నది.
ఏపీలోఅంగన్వాడీ జీతాలు పెంచాలని కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం 21వ రోజు సమ్మె జరుగుతోంది. ఈక్రమంలో కార్యకర్తలు మాట్లాడుతూ.. జీతాలు పెంచకపోతే ఈసారి రాష్ట్రంలో వైసీపీ అడ్రస్ లేకుండా చేస్తామని వ్యాఖ్యనించారు.
వైసీపీ పాలన సరిగ్గా లేదని జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్నారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న హామీ ఏం చేశారని లేఖ ద్వారా నిలదీశారు.
విద్యుత్ కొనుగోలు కోసం గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ శాఖ అనే కాకుండా ప్రతి శాఖను అప్పుల్లో ముంచారని భట్టి మండిపడ్డారు.
తమిళిపై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. సొంత రాష్ట్రం తమిళినాడు నుంచి ఆమె పోటీ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. ఈక్రమంలో గవర్నర్ స్పందించారు.