టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న హామీ ఏం చేశారని లేఖ ద్వారా నిలదీశారు.
Nara Lokesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న హామీ ఏం చేశారని లేఖ ద్వారా నిలదీశారు. వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం అని మీకు మీరు ప్రచారం చేసుకుంటే సరిపోదు. మీ పాలనలో చనిపోయిన 600 మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్క కుటుంబానికైనా పరిహారం ఇచ్చారా? రూ.10 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు కానీ ఇవ్వలేదు? కనీసం కుటుంబాన్ని పరామర్శించారా? ఇదేనా మీ మానవత్వం అంటూ బహిరంగంగా లేఖ రాశారు.
ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ విషయంలో టీడీపీ ప్రభుత్వంపై, నాపై చేసిన ఆరోపణలు ఇంకా మరిచిపోలేదు. వైఎస్ పాలనలో పుట్టిన అగ్రిగోల్డ్ ఆయన హయాంలోనే స్కామ్ జరిగిందన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులు 21 వేల ఎకరాలు అటాచ్ చేసి, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయించి బాధితులకు న్యాయం చేశాం. అయిన మాపై ఆరోపణలు చేశారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా హామీలిచ్చి గద్దెనెక్కాక వైసీపీ చేసిన మోసంతో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడ్డారు. యువగళం పాదయాత్రలో వీరందరూ నన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని లేఖలో లోకేశ్ పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: Revanth Reddy: డెలివరీ బాయ్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థికసాయం