రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. పదవితో బాధ్యత పెరగాలి. కానీ ఆ పదవిని కించపరిచేలా రేవంత్ వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో అన్నారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు. రైతుబంధు కింద వారం రోజుల్లోనే రూ. 7500 కోట్లు రైతులు ఖాతాల్లో కేసీఆర్ వేశారు.
వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని నెల్లూరులో జరిగిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ఆరోపించారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాట పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇకనుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గల్లా చెప్పారు.
పీలేరులో టీడీపీ రా.. కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుంది.
ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈక్రమంలో ఆమె వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడంతో మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి ఉషాశ్రీ చరణ్ షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌కే మెజారిటీ స్థానాలు దక్కుతాయని తాజాగా వెల్లడైంది. ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు 8 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్స్ రిపోర్టు తెలిపింది.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా కరెంట్ బిల్లులు కట్టొద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న ఘనంగా నిర్వహించనున్నారు. ఈక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ కొందరు వైసీపీ నేతలు పార్టీని విడిచి టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కోనసీమ జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ యువజన నాయుడు, శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ వైసీపీకి వీడ్కోలు పలకనున్నారు.