»Andhra Pradesh Another Shock For Ycp Vasamshetty To Join Tdp
Andhra Pradesh: వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి చేరనున్న వాసంశెట్టి
ఎన్నికల సమీపిస్తున్న వేళ కొందరు వైసీపీ నేతలు పార్టీని విడిచి టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కోనసీమ జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ యువజన నాయుడు, శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ వైసీపీకి వీడ్కోలు పలకనున్నారు.
Andhra Pradesh: ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీ గట్టి షాక్‌లు తగులుతున్నాయి. చాలామంది వైసీపీ నేతలు పార్టీని విడిచి టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కోనసీమ జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. అమలాపురానికి చెందిన వైసీపీ యువజన నాయుడు, శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ టీడీపీలో చేరనున్నారు. రేపు 5వేల మందితో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
మంత్రి విశ్వరూప్, మరికొంత మంది సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెట్టారని.. అలాంటి వారికి టికెట్ ఇవ్వొద్దని అగ్రనాయకత్వానికి చెప్పిన పట్టించుకోలేదని తెలిపారు. అందుకే వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్ల కేసులో తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అమయకులపై కేసులు ఎత్తివేయాలని కోరగా.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక నేతలు అడ్డుపడ్డారని సుభాష్ ఆరోపించారు.