వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని నెల్లూరులో జరిగిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ఆరోపించారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాట పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
Chandrababu: వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని నెల్లూరులో జరిగిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ఆరోపించారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాట పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. నాకు కష్టం వస్తే వివిధ రాష్ట్రాలతోపాటు, 80 దేశాల్లో ప్రజలు మద్దతు తెలిపారు. నేను చేసిన అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఒక నాయకుడికి ఇంతకంటే ఇంకేం కావాలని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు.
రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందుందని, ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. ఆక్వా రంగాన్ని బాగు చేస్తానని.. టీడీపీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి చెల్లిస్తామని తెలిపారు. జగన్ అభిమన్యుడు కాదు. భస్మాసురుడని చంద్రబాబు అన్నారు. మద్యం పేరుతో పేదల రక్తాన్ని తాగే వ్యక్తి జగన్. మద్యపాన నిషేధం విధించకపోతే ఓట్లు అడగబోనన్నారు. త్వరలోనే ప్రజలు ఫ్యాన్ రెక్కలను విరిచి పక్కన పెడతారని.. జగన్ పతనం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు.