Chandrababu: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో నిర్వహించిన రా.. కదలి రా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే.. వైసీపీ గంజాయిని ప్రమోట్ చేస్తోందని విమర్శించారు. గిరిజనుల కోసం టీడీపీ ప్రభుత్వం 16 పథకాలు తీసుకొచ్చిందని.. వాటిని వైసీపీ రద్దు చేసిందని చంద్రబాబు తెలిపారు. గతంలో టీడీపీ ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో వైసీపీ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
గిరిజనుల పొట్ట కొట్టే ప్రభుత్వం వైసీపీ. గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్కు ఇష్టం లేదు. అందుకే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారు. ప్రపంచంలో ఎక్కడ చదివినా గిరిజనులకు స్కాలర్షిప్లు ఇస్తే దానిని కూడా తీసేశారన్నారు. నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే వాటిని కూడా తీసేశారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత టీడీపీది. గిరిజనుల సంపదను జగన్ దోచుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల నుంచి జగన్ ఎక్కువ దోచేస్తున్నారు. కానీ జనాలకు మాత్రం తక్కువ ఇస్తున్నారని.. చంద్రబాబు విమర్శించారు.