CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్ల పల్లెను చేరుకుంటారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో రూ.100 నాణెం పైన ఆయన బొమ్మను ముద్రించనున్నారు. ఈ నాణేన్ని పూర్తిగా వెండితో తయారు చేస్తారు.
మంత్రి అయితే ఎవరికి గొప్ప. మా తమ్ముడు కారు నడిపి జీవనం సాగిస్తున్నాడు. వాడు కారు తిప్పితే మా అమ్మ పింఛన్ ఎలా తొలగిస్తారు’ అని వెంకటేశ్వర్లు మంత్రి అంబటిని నిలదీశాడు. ఈ క్రమంలో మంత్రికి, ఆ యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. మంత్రి నిలదీస్తావా అంటూ పోలీసులు అతడిని లాక్కెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు.
ఆర్కే రోజాను ప్రస్తావిస్తూ ‘ఇది వరకే తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక మంత్రి రోజా చెప్పారు’ అంటూ ప్రసంగిస్తుండగా అక్కడే ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు ‘ఆంధ్రప్రదేశ్’ అని రెండు మూడుసార్లు చెప్పారు. ఈ పరిణామానికి వెంటనే తేరుకున్న కిషన్ రెడ్డి, రోజా ఇద్దరు గొల్లున నవ్వారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారందరూ నవ్వుకున్నారు. అయితే ఈ విషయమై రోజాకు వివరణ ఇస్తుండగా.. ‘పర్లేదు. కానీయండి’ అంటూ రోజా అన్నారు. అనం...
ఆర్థికమంత్రి మాట్లాడుతూ... మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని కాదని, అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేపట్టిన హాత్ సే హాత్ ( Hath Se Hath)జోడో పాదయాత్ర భద్రాచలంBhadrachalam) జిల్లాలో కొనసాగుతోంది. రేవంత్ పాదయాత్రకు నేడు 8వ రోజు. కాగా, ఆయన ఇవాళ ఓ పొలంలో దిగి వరి నాట్లు వేశారు.
kotamreddy vs anil:నెల్లూరు (nellore) బారషహీద్ దర్గా వద్దకు భక్తులు వస్తుంటారు. ఈ రోజు కూడా రద్దీగా ఉంది. అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. కత్తిపోట్లు పొడుచుకోగా.. పోలీసులను మొహరించారు. దర్గా వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు తీసుకు రావాల్సిన మంత్రి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి వనిత (Vangalapudi Anitha) ధ్వజమెత్తారు.
సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) రాష్ట్రంలో హంగ్ వస్తోందని.. బీఆర్ఎస్‌తో (brs) పొత్తు ఉంటుందని చెప్పారు. సొంత పార్టీ నేతలు విమర్శలు.. హై కమాండ్ ఆరా తీయడంతో వెంటనే నాలిక కరుచుకున్నారు. అబ్బే.. తాను అలా అనలేదని చెప్పారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో (Hung) హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, అప్పుడు కాంగ్రెస్‌తో కేసీఆర్ చేతులు కలుపుతారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. వరంగల్ సభలో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ (Rahul Gandhi)చెప్పిన మాటల్ని మాత్రమే తాను రిపీట్ చేశానని స్పష్టం చేశారు.
RK Roja: నారా లోకేశ్‌పై (nara lokesh) మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఫైరయ్యారు. నిన్న నగరి (nagari) యువగళం పాదయాత్రలో రోజాను.. జబర్ధస్త్ ఆంటీ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి ఈ రోజు రోజా కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ ఐరన్ లెగ్ (iron leg) అన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువు అయ్యిందని పేర్కొన్నారు. లోకేశ్‌కు (lokesh) పెద్దలను గౌరవించడం తెలియదని మండిపడ్డారు.
KA Paul :కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ఆయన కామెంట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ ఉప ఎన్నికలో మూడు లక్షల ఓట్లు ఉంటే మూడు వేల ఓట్లు పడ్డాయని, ఇక భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవదనే విషయం అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు.
నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల అనంతరం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో కలిసి వెళ్లదని, అలాంటి సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.