»Revanth Reddy Planted Paddy In The Field At Bhadrachalam
Revanth Reddy : భద్రాచలం వద్ద పొలంలో దిగి వరి నాట్లు వేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేపట్టిన హాత్ సే హాత్ ( Hath Se Hath)జోడో పాదయాత్ర భద్రాచలంBhadrachalam) జిల్లాలో కొనసాగుతోంది. రేవంత్ పాదయాత్రకు నేడు 8వ రోజు. కాగా, ఆయన ఇవాళ ఓ పొలంలో దిగి వరి నాట్లు వేశారు.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేపట్టిన హాత్ సే హాత్ ( Hath Se Hath)జోడో పాదయాత్ర భద్రాచలంBhadrachalam) జిల్లాలో కొనసాగుతోంది. రేవంత్ పాదయాత్రకు నేడు 8వ రోజు. కాగా, ఆయన ఇవాళ ఓ పొలంలో దిగి వరి నాట్లు వేశారు. పాదయాత్ర మార్గమధ్యంలో పొలాన్ని చూడగానే, ఆయన ప్యాంటు పైకి మడిచి, తలపాగా చుట్టారు. అప్పటికే నాట్లు వేస్తున్న కూలీలను పలకరించి, వారితో కరచాలనం చేశారు. ఆపై, తాను కూడా వారితో నాట్లు వేశారు. మహిళా కూలీలు పాట పాడుతుండుగా, రేవంత్ ఉత్సాహంగా నాట్లు వేశారు.ఈ సందర్భంగా రేవంత్… డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందా అని అడిగారు.
అందుకు వారు రాలేదన్నా అంటూ బదులిచ్చారు. దాంతో, రేవంత్ స్పందిస్తూ, పేదలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారం రావాలని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని రేవంత్ వివరించారు. ఈ సందర్భంగా ఓ మహిళా కూలీ భావోద్వేగాలకు గురై కంటతడి పెట్టుకోగా… రేవంత్ ఆమెను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనసరి సీతక్క(Sitakka ) కూడా అక్కడే ఉన్నారు. ఆమె కూడా పొలంలో దిగి నాట్లు వేశారు.మేం అధికారంలోకి వస్తే.. ఐదు వందలకే సిలిండర్’’. అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి బంపరాఫర్ ప్రకటించారు. అయితే కండీషన్స్ అప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడిదో హాట్ టాపిక్ గా మారింది మేం అధికారంలోకి వస్తే.. ఐదు వందలకే సిలిండర్’’. అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి బంపరాఫర్ ప్రకటించారు. దీంతో ఇప్పుడిదో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం మణుగూరు (Manuguru)సభలో రేవంత్ చేసిన కీలకమైన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఎందరో అక్కలున్నారు.
ఒక మిర్చీ బండి దగ్గరకెళ్లి ఆ అక్కను తాను సిలిండర్ ధరల గురించి వాకబు చేశాననీ. అలా అన్ని వర్గాలకు చెందిన అక్కలను తాను అడగ్గా.. వారి నుంచి తనకొచ్చిన సమాధానం ఒక్కటేనంటూ తెలిపిన రేవంత్ కీలక హామీనిచ్చారు.రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటంటే.. తాము పవర్ లోకి వస్తే.. మీ పెట్రోల్ కష్టాలు తీరుతాయ్. మేం గద్దెనెక్కితే.. మీకు గ్యాస్ సిలిండర్ సమస్యలు సమసిపోతాయి. ఇప్పటికి మీరు 1200 రూపాయలను ఖర్చు చేస్తే గానీ సిలిండర్ని ఇంటికి తేలేక పోతున్నారు. అదే మేంగానీ అధికారంలోకి వస్తే.. ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం. దీనివల్ల ఒకటీ రెండు కాదు ఏకంగా ఏడు వందల రూపాయలు మిగులుతాయి. మా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సిలిండర్(cylinder) ధరలు ఎలా ఉన్నాయో.. ఇక్కడా అలాంటి ధరల్లోనే మీ ఇంటికి సిలిండర్ చేర్చే బాధ్యత మాది.. అంటూ.. హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి (Revanth Reddy)..ఇపుడీ హామీ కారణంగా.. స్థానిక మహిళల మధ్యే కాదు. ఇంటింటా సిలిండర్ ధరల పై చర్చ నడుస్తోంది. అయితే, ఇందులో కండీషన్ ఏంటంటే.. కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించాల్సి ఉంటుందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఈ హామీ అమలవుతుందని రేవంత్ చెప్పకనే చెప్పారు.