వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల(ys sharmila) తన పాదయాత్రలో భాగంగా గీత కార్మికుడి దగ్గర నీరా(కల్లు)ను రుచి చుశారు. రెండు సార్లు కల్లును తాగి రుచి ప్రత్యేకంగా ఉన్నట్లు ఫెస్ ఎక్స్ ప్రేషన్స్ పెట్టారు. ఈ సంఘటన జనగామ జిల్లా(jangaon district) పాలకుర్తి నియోజక వర్గం(palakurthi constituency)లో కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర(praja prasthanam padayatra)లో భాగంగా లక్ష్మీనారాయణ పురం దగ్గర చోటుచేసుకుంది. గీత కార్మికుని కోరిక మేరకు షర్మిల కల్లు రుచిచూసినట్లు తెలుస్తోంది. అయితే కల్లు తాగడం తనకు అలవాటు లేదని చెప్పిన షర్మిల(ys sharmila) కార్మికుని విజ్ఞప్తి మేరకు రుచి చూశారు. మరోవైపు రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ(ysr telangana party) అధికారంలోకి వస్తే గీత కార్మికులకు ప్రాధాన్యం ఇస్తామని షర్మిల పేర్కొన్నారు.
ఇప్పటికే తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని షర్మిల గుర్తు చేశారు. సీఎం కేసీఆర్(cm kcr)అబద్ధపు హామీలు తప్ప ప్రజలకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యుత్ కోతలు(power cuts), రైతుల ఆత్మహత్యలు సహా పలు అంశాల గురించి తెలంగాణ ప్రభుత్వాన్ని(telangana government) షర్మిల నిలదీశారు. ఈ క్రమంలో తన పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుని, తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని షర్మిల హామీ ఇస్తున్నారు.
మరోవైపు ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) పాదయాత్ర కూడా కొనసాగుతుండటం విశేషం. ఈ క్రమంలో అక్కడి పోలీసులు(police) పెద్ద ఎత్తున సిబ్బందిని ఏర్పాటు చేసి బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో దేవరుప్పుల(devaruppula) మండలంలో పలు షాపులను సైతం మూయించారు. మరోవైపు ఇదే నియోజక వర్గం నుంచి అధికార పార్టీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.