DK Aruna : బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ స్వాగతం పలికారు. కలిసి పనిచేద్దామంటూ ఆయనకు స్వాగతం పలికారు. ఫోన్ చేసి మరీ బీజేపీలో చేరమని ఆమె కోరడం గమనార్హం.
రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఒకరోజు దీక్ష చేపట్టారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ చర్యలు తీసుకోవడం లేదని.. అందుకు నిరసనగా దీక్షకు దిగారు.
ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో రామోజీరావుపై వేధింపులు సరికాదంటున్నారు.
మంత్రి కేటీఆర్ ఎక్కడ పర్యటించిన సరే.. సెల్పీల కోసం యువత ఆరాట పడతారు. కాదనకుండా వారికి సెల్ఫీ ఇస్తుంటారు. ఎల్లారెడ్డిపేటలో సెల్ఫీల కోసం జనం వస్తూనే ఉన్నారు. దీంతో మంత్రి సెల్ఫీ రూ.500 ఇవ్వాలని సరదాగా కామెంట్ చేశారు.
సీఎం కేసీఆర్ పై అసంతృప్తి వారిద్దరిని కలిపింది కానీ వారి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. మరి రాజకీయంగా వారిద్దరూ కలిసి వెళ్తారా? అనేది ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. వారిద్దరూ ఏ రాజకీయ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. వారికి స్వాగతమంటూ కాంగ్రెస్, బీజేపీ ఆఫర్లు ప్రకటించాయి. కానీ వారిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించడం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేయడంతో వారు కొంత వెనక్కి తగ్గారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్ తమిళిసై తన వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు అకస్మాత్తుగా ఆమోదం తెలిపారు.
తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు.
తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన మీద చైనా అభ్యంతరం చెప్పడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. మన భూభాగాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఎవరూ లాక్కోలేరని డ్రాగన్ కంట్రీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు