Kavitha:సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) కాలికి (Avulsion Fracture) గాయం అయ్యింది. ఆమె వైద్యులను (doctors) కలువగా.. మూడు వారాలు (three weeks) విశ్రాంతి (rest) తీసుకోవాలని సూచించారు. దీంతో ఆమె అందుబాటులో ఉండనని.. ఏదైనా సహాయం, సమాచారం కోసం తన కార్యాలయ సిబ్బంది మాత్రం అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) కవిత (kavitha) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఎంక్వైరీ చేసిన ప్రతీసారి అరెస్ట్ అని ప్రచారం జరిగింది. సుదీర్ఘంగా విచారించడంతో హైప్ క్రియేట్ అయ్యింది. కవిత (Kavitha) ఫోన్లను ధ్వంసం చేసిందని ఈడీ అధికారులు (ed officials) చెప్పగా.. అదేం లేదని విచారణకు హాజరవుతూ చూపించిన సంగతి తెలిసిందే.