DK Aruna : కలిసి పనిచేద్దాం: జూపల్లికి డీకే అరుణ ఆహ్వానం..!
DK Aruna : బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ స్వాగతం పలికారు. కలిసి పనిచేద్దామంటూ ఆయనకు స్వాగతం పలికారు. ఫోన్ చేసి మరీ బీజేపీలో చేరమని ఆమె కోరడం గమనార్హం.
బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ స్వాగతం పలికారు. కలిసి పనిచేద్దామంటూ ఆయనకు స్వాగతం పలికారు. ఫోన్ చేసి మరీ బీజేపీలో చేరమని ఆమె కోరడం గమనార్హం. అయితే….తాను తన కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన డీకే అరుణకు చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉండగా… పార్టీ విధానాలను అనుసరించకుండా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పొంగులేటి దారిలోనే నడుస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపైనా సస్పెన్షన్ వేటు పడింది.
కేసీఆర్ ఆదేశాల మేరకు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీరిద్దరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపింది.కొద్దిరోజులుగా పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమావేశాలు అంటూ హడావుడి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిపై సస్పెన్షన్ వేటు పడింది.