టీడీపీ(TDP) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఏపీ సీఎం జగన్(CM Jagan) పై సంచలన ఆరోపణలు చేశారు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని నిమ్మల ఆరోపించారు.
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో మాట్లాడుతుండగా.. వెనకాల కేసీఆర్ నిల్చొని ఉన్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
హైదరాబాద్ (Hyderabad) లో వర్షాలు మరో ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయి. సికింద్రాబాద్ లోని కళాసిగూడ(Kalasiguda) లో తెరచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి పదేళ్ల మౌనిక అనే బాలిక చనిపోయింది. ఈ విషాద ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు.
సికింద్రాబాద్ (Secunderabad) కళాసిగూడ చిన్నారి మృతి ఘటనపై బల్దియా చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులపై వేటు వేసింది. బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణలను సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు.
పంట నష్టపోయి రైతులు సర్వం కోల్పోయారు. ఇంత నష్టం జరిగినా సీఎం కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు. గతనెల 23న హెలికాప్టర్ లో వచ్చి పరిశీలించి వెళ్లిన సీఎం అప్పుడు ఎకరాకు రూ.10 వేల సహాయం ప్రకటించారు. కానీ నెల దాటినా ఒక్క రూపాయి ఇవ్వలేదు అని షర్మిల విమర్శించారు.
సుడాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2400 మందిని సురక్షితంగా భారత్ తీసుకొచ్చామని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
రెజ్లర్ల సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిష్కరిస్తారనే నమ్మకం లేదు. వీరి గురించి ఆందోళన చెంది ఉంటే ఇంతవరకు రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు? కనీసం వీరిని కలిసేందుకు కూడా ప్రయత్నించలేదు. రెజ్లర్లకు యావత్ దేశం అండగా నిలుస్తుంది
టీడీపీ అధినేత చంద్రబాబును చూసి ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తోందని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. రజనీ కామెంట్లను ఏపీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.
దాడికి నిరసనగా కుప్పంలో ఆందోళన చేస్తుండగా వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. తెలుగు తమ్ముళ్లపై విచక్షణరహితంగా కొట్టారు. పిడిగుద్దులు గుద్దుతూ.. గోడకేసి కొడుతూ బీభత్సం సృష్టించారు.