టీడీపీ(TDP) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఏపీ సీఎం జగన్(CM Jagan) పై సంచలన ఆరోపణలు చేశారు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని నిమ్మల ఆరోపించారు.
Nimmala Ramanaidu : టీడీపీ(TDP) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఏపీ సీఎం జగన్(CM Jagan) పై సంచలన ఆరోపణలు చేశారు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని నిమ్మల ఆరోపించారు. సీఎం జగన్ చేస్తున్న క్రిమినల్(Criminal) పనులకు ప్రత్యక్ష ఉదాహరణ ఆయన బాబాయి వైఎస్ వివేకా(YS Viveka) హత్యేనన్నారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన వ్యక్తి సీఎంగా రాష్ట్రానికి అవసరమా..? అని ప్రశ్నించారు. వివేకా హత్య మీద సీబీఐ విచారణ కోరి.. అధికారంలోకి రాగానే సీబీఐ(CBI) విచారణ అక్కర్లేదన్నారని మండిపడ్డారు. శనివారం అమరావతిలో మీడియా().తో నిమ్మల మాట్లాడారు.
అవినాష్ రెడ్డి(Avinash Reddy)ని రక్షించకుంటే తాడేపల్లి(Tadepalli) కుట్ర బయటకు వస్తుందని జగన్ ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వివేకా క్యారెక్టరుపై దిగజారి విమర్శలు చేశారని..తప్పుడు అఫిడవిట్లు వేశారన్నారు. నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధాలు అంటగట్టడం ఎంత వరకు కరెక్ట్ అని నిమ్మల రామానాయడు నిలదీశారు. చిన్నాన్న సౌమ్యుడు.. ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదని జగన్ చెల్లి షర్మిళే(YS Sharmila) చెప్పారని గుర్తు చేశారు. జగనన్నే మా నమ్మకం అనే స్టిక్కర్లు చెల్లెళ్లు షర్మిళ, సునీత ఇళ్లకు అతికించగలరా..? అని ప్రశ్నించారు.
సీఎం జగన్ రాష్ట్రంలో వివిధ మార్గాలద్వారా ఇప్పటి వరకు రూ.1.20 లక్షల కోట్లని దోపిడీ చేశారన్నారు. దాదాపు 13 అంశాల్లో యథేచ్చగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారంటూ విమర్శించారు. కేవలం భూమిపైనే అధికారపార్టీ నాయకులు రూ.40వేల కోట్లు దోచుకున్నారన్నారు. జగనాసుర అవినీతి రక్త చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాధనం దోపిడీ చేస్తున్న జగన్ సీఎం కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడన్నారు.