Operation Kaveri:సుడాన్ నుంచి 2400 మంది భారతీయుల తరలింపు
సుడాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2400 మందిని సురక్షితంగా భారత్ తీసుకొచ్చామని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Operation Kaveri:సుడాన్లో (sudan) సైన్యం, పారా మిలిటరీ దళాల మధ్య పోరాటం జరుగుతోంది. పారా మిలిటరీని సైన్యంలో కలిపేయాలని సైనిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఘర్షణకు దారితీసింది. సైన్యం, పారామిలిటరీ దళాల అధిపతులు పోరాటానికి దిగారు. హింసాత్మక ఘర్షణల్లో వందల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణ మధ్యలో 3 రోజులు కాల్పుల విరమణకు ఇరువర్గాలు అంగీకరించడంతో.. భారత్ సహాయక చర్యలు చేపట్టింది. విమానాలు, యుద్ధ నౌకలను పంపించి.. భారతీయుల తరలింపు ప్రక్రియ చేపట్టింది.
సుడాన్లో (sudan) చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు. ఇప్పటివరకు 2400 మంది (2400 people) భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని భారత ప్రభుత్వం తెలిపింది. భారత వాయుసేన, నావికా దళం వీరిని తీసుకొచ్చింది. ప్రైవేట్ ఎయిర్ లైన్ ఇండిగో కూడా తరలింపు ప్రక్రియలో భాగస్వామి అయ్యిందని విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ (muralidharan) తెలిపారు. బ్యాచ్లలో భారతీయులు సుడాన్ (sudan) నుంచి జెడ్డా.. అక్కడి నుంచి భారత్ తరలిస్తున్నారు. ఇండియన్స్తోపాటు ఇతరులకు కూడా వాయుసేన సాయం చేసింది.
13వ బ్యాచ్లో భాగంగా 300 మందిని (300 people) సుడాన్ (sudan) నుంచి తరలించారు. శుక్రవారం రాత్రి వీరు పోర్ట్ సుడాన్ నుంచి బయల్దేరారు. నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ పోర్ట్ సుడాన్ నుంచి సౌదీ అరేబియాలో గల జెడ్డా (jeddah) నగరానికి తీసుకొచ్చారు. అక్కడినుంచి వీరిని భారత్ తరలిస్తారు. 12వ బ్యాచ్లో ఎయిర్ ఫోర్స్ సీ-130జే విమానం.. 135 మంది భారతీయులతో సుడాన్ (sudan) నుంచి జెడ్డాకు చేరుకుంది.
భారతీయులు అందరినీ సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి మురళిధరన్ (muralidharan) పేర్కొన్నారు. 10, 11 బ్యాచ్లలో 135 మంది భారతీయులను జెడ్డాకు తరలించారు. పోర్ట్ సుడాన్ చేరుకునేందుకు ఇబ్బంది పడ్డ 121 మందిని సురక్షితంగా కాపాడారు. సెయిడ్నా ప్రాంతం నుంచి పోర్ట్ సుడాన్ తీసుకొచ్చింది. ఓ గర్బిణీ సహా వైద్య సహాయం అవసరం ఉన్న వ్యక్తులు ఉన్నారని భారత వాయుసేన పేర్కొంది.