కేరళ స్టోరీ(The Kerala Story) ఓ విషపూరిత ఉగ్రవాదాన్ని బట్టబయలు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp adda) అన్నారు. తుపాకులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో కూడిన ఉగ్రవాదం గురించి మనం విన్నాం. కానీ ఇది మరొక ప్రమాదకరమైన ఉగ్రవాదమని వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూసిన సందర్భంగా నడ్డా ఈ కామెంట్స్ చేయడం విశేషం.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు(naga babu konidela) ఏపీ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారత్ రాష్ట్ర సమితికి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన పార్టీలు బీఆర్ఎస్ లో విలీనమవుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ విలీనం కాగా తాజాగా మరో పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది.
మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలో అడుగుపెట్టనీయమని హెచ్చరించారు. బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ బీసీ జనగణన చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణిపూర్లో(manipur) చిక్కుకున్న ప్రతి ఏపీ విద్యార్థిని(ap students) తీసుకొస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) స్పష్టం చేశారు. ప్రత్యేక విమానంలో అక్కడ ప్రస్తుతం ఉన్న 157 మంది ఏపీ స్టూడెంట్స్ ను తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అన్నారు.
రేపు(మే 8న) కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi vadra) హైదరాబాద్(hyderabad) రానున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్(ktr) కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం చెబుతుందని అన్నారు.
40 శాతం కమీషన్ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారు. అవినీతి ప్రభుత్వాన్ని దహనం చేయడం మాత్రం గ్యారంటీ. తన పర్యటనతో ప్రధాని మోదీ బెంగళూరులో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
వీరి మద్దతుతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ వచ్చింది. అతి పెద్ద సామాజికవర్గం మద్దతు తెలపడంతో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీదే హవా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తోంది.
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడడంపై లేదా?’ అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని గుర్తు చేశారు. తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు.
ఇళయరాజా(Ilayaraja) అంగీకారంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీ(Music University)ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) ప్రకటించారు.
తెలంగాణ(Telangana)లో సరిపడ కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయని, పరిశ్రమలు పెట్టుకోవడానికి సరైన ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. అమరరాజా యూనిట్ రావడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం దేశంలో వివాదాస్పద చిత్రంగా నిలిచిన సినిమా ది కేరళ స్టోరీ(the kerala story). విడుదలకు ముందే ఈ సినిమాపై దుమారం రేగింది. దీనిని థియేటర్లలో ప్రదర్శించకూడదు అంటూ.. పలువురు ఆందోళనలు కూడా చేపట్టారు. ఉగ్రవాద కుట్ర ఆధారంగా దీనిని తెరకెక్కించారు. కాగా, ఈ సినిమాపై తాజాగా ప్రధాని మోదీ(pm modi) స్పందించారు.