గోనె ప్రకాశ్ రావు చేసిన ఆరోపణలపై బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. ఆయన చేత కావాలనే మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు. భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు.
నటుడు మహేష్ అనే కంటే, రంగస్థలం మహేష్ అనే అందరికీ బాగా గుర్తుకు వస్తాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ పక్కన త్రూ అవుట్ క్యారెక్టర్ చేయడంతో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాడు. దానికి ముందు, తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, అతనిని అందరూ రంగస్థలం మహేష్ గానే గుర్తుపెట్టుకున్నారు. ఈ సంగతి పక్కన పెడితే, మహేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పడం విశేషం.
యన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ నాయకులంతా ముక్తకంఠంతో చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం కూడా ఇదేనని సమావేశంలో చర్చ జరిగింది. దీంతో అందరి అభిప్రాయం మేరకు శరద్ పవార్ నే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించాలని ప్యానెల్ తీర్మానించింది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తోన్న సిట్‌పై తమకు నమ్మకం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కేటీఆర్ మీద ఈ రోజు ఫిర్యాదు చేశారు.
తిరుమల క్షేత్రానికి సంబంధించిన భూములు, బంగారం, ఇతర ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. ఇదే అంశంపై టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం.
జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satya Pal Malik) ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని కాలేరని అన్నారు. అంతేకాదు BJP, RSS భావజాలం, పనితీరు గురించి కూడా ప్రస్తావించారు.