AP High Court Dismisses Amaravati Farmers R5 Zone Petition
AP High Court:అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) చుక్కెదురైంది. ఆర్5 జోన్ (R5 ZONE) పిటిషన్‌ను ధర్మాసనం ఈ రోజు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రైతులు రేపు సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేస్తామని చెబుతున్నారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయించేందుకు ఏపీ సర్కార్ ఆర్5 పేరుతో ప్రత్యేక జోన్ (special zone) ఏర్పాటు చేసింది. గుంటూరు (guntur) జిల్లా నుంచి 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి 583.93 ఎకరాల భూమిని కలెక్టర్లకు బదిలీ చేస్తూ సీఆర్డీయే కమిషనర్‌కు అనుమతిస్తూ జీవో నంబర్ 45ను ప్రభుత్వం తీసుకొచ్చింది.
దీనిని అమరావతి రైతులు (amaravati farmers) వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో (highcourt) సవాల్ చేశారు. అమరవాతిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ది చేయాలని రైతులు కోరారు.
ఆర్-5జోన్ ఏర్పాటు, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలంటూ రాజధాని రైతులు మధ్యంతర ఉత్తర్వులు కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది.