Congress standing with terrorists PM Modi cites The Kerala Story
Congress standing with terrorists:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. ఈ రోజు బళ్లారిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ‘ద కేరళ స్టోరీ’ సినిమా విడుదల కాగా.. కేరళ ముస్లిం (kerala muslims) మహిళలు ఉగ్రవాదం వైపు మళ్లారనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. సినిమాపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. సినిమాను ప్రదర్శించొద్దని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ (modi) కేరళ స్టోరీ మూవీ గురించి ప్రస్తావించారు. అందమైన కేరళ రాష్ట్రంలో జరిగన అంశాలను రూపొందించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల వైపు నిలబడుతోంది ధ్వజమెత్తారు. ఉగ్రవాద కుట్ర కోణాన్ని తెలిపే సినిమాను కాంగ్రెస్ ( Congress) అడ్డుకునే యత్నం చేస్తోందని ఆరోపించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ఉగ్రవాదానికి కవచంలా మారిందన్నారు. ఇలాంటి పార్టీ కర్ణాటకను ఎలా కాపాడుతుందనిప్రశ్నించారు. ఉగ్రవాద శక్తులకు తెరవెనుక సహాయపడాలనుకునే కాంగ్రెస్ పార్టీతో కర్ణాటక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ తొలి నుంచి ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.
కేరళలో జరుగుతున్న ఉగ్రవాద కుట్రను సినిమాలో చూపించారు. సమాజాన్ని నాశనం చేసే ఉగ్రవాదులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతోందని మోడీ ఆరోపించారు. ఉగ్రవాద ధోరణితో సంబంధం ఉన్నవారితో కాంగ్రెస్ రాజకీయ చర్చల్లో పాల్గొంటుందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్‌ను నిషేధం విధిస్తామని పేర్కొంది. ఆ వెంటనే వెనక్కి తీసుకున్న లాభం లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీంతో అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా హనుమాన్ ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించి.. గొడవను సద్దుమణిగేలా చేశారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్.