వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి(Katasani ram bhupal reddy) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(nara lokesh)పై మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను భూ కబ్జాలు ఎక్కడ చేశానో నిరూపించాలన్నారు. లేకపోతే లోకేష్ క్షమాపణలు చెప్పాలన్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. ఎక్కడైనా చర్చకు రెడీ అన్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోకేష్ విమర్శిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.
పాదయాత్రలో భాగంగా లోకేష్ అధికార పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతులను ఆయన బయటపెడతున్నారు. పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి పై కూడా లోకేష్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే సరిపోతుందా.. ప్రజలకు మంచి చేయాలని కదా అని నిలదీశారు. తప్పులు ఎత్తి చూపితే బూతులు తిడుతున్న బూతుల పార్టీ నాయకుడని అన్నారు. ఎమ్మెల్యే కాటసాని(mla Katasani) అవినీతిని సర్వే నెంబర్లతో సహా బయట పెట్టానని లోకేష్ చెప్పారు.
కాగా, లోకేష్ తనపై చేసిన ఆరోపణలపై కాటసాని స్పందించారు. నారా లోకేష్ జోకర్ కు ఎక్కువ బఫూన్ కు తక్కువ అని కాటసాని అన్నారు. లోకేష్ కు దమ్ముంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలన్నారు. లోకేష్ వయసు తన రాజకీయ అనుభవం అంత లేదని కాటసాని గుర్తు చేశారు లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. మరి కాటసాని విసిరిన సవాలు కి లోకేష్ కానీ, ఇతర టీడీపీ నేతలు గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.