»Minister Ktr Inaugurates It Tower In Mahabubnagar
KTR: అమరరాజా బ్యాటరీ కంపెనీకి కేటీఆర్ శంకుస్థాపన..10 వేల మందికి ఉపాధి
తెలంగాణ(Telangana)లో సరిపడ కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయని, పరిశ్రమలు పెట్టుకోవడానికి సరైన ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. అమరరాజా యూనిట్ రావడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
పరిశ్రమలకు అవకాశం ఇస్తేనే కొలువులు వస్తాయని, రాష్ట్రానికి సంపద కూడా పెరుగుతుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద 270 ఎకరాల్లో అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీ(Amararaja Battery Company)కి మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్ లు పాల్గొన్నారు. సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు.
లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్‌లో భారత్ లోనే ఇదే అతి పెద్ద పెట్టుబడి అని కేటీఆర్(KTR) తెలిపారు. తెలంగాణ(Telangana)కు అమరరాజా గ్రూప్(Amara raja Group) రూ.9,500 కోట్ల పెట్టుబడిని తెచ్చినందుకు అమర రాజా కుటుంబీకులకు ధన్యవాదాలు తెలియజేశారు. దివిటి పల్లిలో ప్లాంట్ పెడుతున్నామని ప్రకటించాక 8 రాష్ట్రాల సీఎంలను, మంత్రులను రాష్ట్రానికి రావాలని ఆహ్వానించామని, కానీ అమరరాజా గ్రూప్ మాత్రమే ప్లాంట్ ప్రారంభించేందుకు వచ్చిందని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ(Telangana)లో సరిపడ కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయని, పరిశ్రమలు పెట్టుకోవడానికి సరైన ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. అమరరాజా యూనిట్ రావడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే పదేళ్లలో అమరరాజా కంపెనీ(Amararaja Battery Company) రూ.9,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతోందని, 3 ఏళ్లల్లో 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. దీని వల్ల రాష్ట్రానికి మంచి ఆదాయ వనరు లభించినట్లైయ్యిందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.