AP: వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి కుమారి ఆంటీ రూ.50వేలు విరాళం అందించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసి చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆమెను చంద్రబాబు అభినందించారు. మరోవైపు గౌతమ్ విద్యాసంస్థల తరపున రూ.25 లక్షల చెక్కును ఆ సంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్ సీఎంకు అందజేశారు.