రతన్ టాటా మరణంపై భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరనే వార్తతో విచారానికి లోనయ్యానని తెలిపారు. దేశానికి రతన్ టాటా అత్యంత విలువైన వ్యక్తి అని కొనియాడారు. అధికారంలో ఉన్నవారితో నిజం మాట్లాడే ఏకైక వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు టాటా సన్స్ ఛైర్ పర్సన్ చంద్రశేఖరన్‌కు మన్మోహన్ లేఖ రాశారు.