కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. RBI వడ్డీరేట్లు తగ్గించడం సరైన పద్ధతి కాదంటూ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ Xలో పోస్ట్ పెట్టారు. ‘RBI స్వతంత్రతపై ఆందోళనలు వ్యక్తమవుతోన్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆహార ద్రవ్యోల్బణం రెండు అంకెలకు చేరుకుంది. RBI మానిటరీ పాలసీ రేట్లను నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం’ అని వెల్లడించారు.