HYD: చాంద్రాయణగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న కుల గణన సర్వేను స్పెషల్ అధికారి IAS శ్రీవాస్తవ పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే నిర్వహించాలని ఎన్యుమరేటర్లకు ఆయన సూచించారు. ఇప్పటికే దాదాపుగా వెయ్యికిపైగా ఇళ్లల్లో సర్వే పూర్తయిందని ఎన్యుమరేటర్లు కలెక్టర్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి సామ్రాట్ అశోక్, డిప్యూటీ కమిషనర్ సురేందర్ పాల్గొన్నారు.