W.G: ఆలమూరులో స్టేట్ హైవే రోడ్డుపై రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. తుఫాను నేపథ్యంలో ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని రైతులను హెచ్చరించారు. అంతవరకు ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలు లేదా అగ్రికల్చర్ మార్కెట్ గోడౌన్లలో భద్రపరుచుకోవాల్సిందిగా సూచించారు.