NLR: అల్పపీడిన ప్రభావంతో ఆత్మకూరు డివిజన్లో గత మూడు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆత్మకూరు ఆర్డీవో బీ.పావని హెచ్చరించారు. మంగళవారం నుంచి ఆత్మకూరు డివిజన్ పరిధిలో కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి అన్నారు. ఎప్పటికప్పుడు అన్ని మండలాల అధికారులను సంప్రదిస్తున్నామని ఆర్డీవో తెలిపారు.