ప్రకాశం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజలపై భారాలు మోపితే పోరాటాలు తప్పవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆ పార్టీ ఒంగోలు నగర 13వ మహాసభలు సందర్భంగా సుందరయ్య భవన్లో గురువారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ట్రూ అప్ చార్జీల పేరుతో ఈనెల, వచ్చే నెలలో ప్రజలపై విద్యుత్ భారం పడనుందన్నారు. సభకు నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు.