BMW ఇండియా ‘2024 M340I’ పర్ఫామెన్స్ సెడాన్ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ.74.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). దేశవ్యాప్తంగా ఈ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. త్వరలోనే డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కారు 48వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్‌తో 374 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే.. 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది. 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగవంతం అవుతుంది.