AP: దేశానికి బీజేపీ ద్రోహం చేసిందని ఏపీపీఎస్సీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పదేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా తేలేకపోతున్నారని మండిపడ్డారు. జగన్‌కి బీజేపీతో అక్రమ పొత్తు ఉందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు ఉండటం వల్ల రాష్ట్రం కోసం చంద్రబాబు మాట్లాడే పరిస్థితిలో లేరని తెలిపారు. పేదలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు.