టాలీవుడ్లో ఇటీవల వరుస సినిమాలతో అలరిస్తున్న హీరోయిన్ కావ్య థాపర్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ ఇంటర్యూలో స్వయంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. కెరీర్ తొలిరోజుల్లో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌కు వెళ్లగా ఓ వ్యక్తి 4 యాడ్స్‌లో అవకాశాలిస్తానని చెప్పాడని.. కానీ కమిట్మెంట్ అడిగినట్లు తెలిపింది. అయితే తనకు చాలా కోపం వచ్చిందని.. ఇలాంటివి నచ్చవని అతడి మొహం మీదే చెప్పానని స్పష్టం చేసింది.