ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ పార్టీ కైవసం చేసుకుంది. ఆప్ అభ్యర్థి మహేశ్ ఖించి, BJP అభ్యర్థి కిషన్లాల్ను ఓడించి ఢిల్లీకి కొత్త మేయర్గా ఎన్నికయ్యారు. ఓటింగ్ మొత్తం 265 ఓట్లు పోల్ అవ్వగా అందులో 2 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మహేశ్ ఖించికి 133 ఓట్లు రాగా.. బీజేపీ ప్రత్యర్థి కిషన్ లాల్ కు 130 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం మూడు ఓట్ల తేడాతో ఆప్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.