ప్రకాశం: సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అనైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దన్నారు.