TG: ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మధుయాష్కీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.