SKLM: ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామపంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్లో భాగంగా చెత్తను తరలించే ట్రాక్టర్ను ప్రభుత్వం మంజూరు చేసిందని సర్పంచ్ ప్రతినిధి అప్పలనాయుడు, పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్ను, తాళాలను కంపెనీ ప్రతినిధులు గురువారం అందజేశారని అన్నారు. పరిసరాల పరిశుభ్రతకు పారిశుద్ధ్య పనులను సమర్థవంతంగా నిర్వహిస్తామని అన్నారు.