AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మంగళగిరి పోలీసులు ఆయనను గంటన్నరపాటు ప్రశ్నించారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో అక్రమ కేసులు పెట్టారని సజ్జల అన్నారు. వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఘటన జరిగిన రోజు తాను అక్కడ లేనని అయినా తనపై కేసు పెట్టారని ఆరోపించారు.