AP: కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జాబ్ ఫస్ట్ అనే నినాదం మంచిదేనని తెలిపారు. హామీలు అమలు చేసే చిత్తశుద్ధి బాబుకు ఉందా? అని ఆమె ప్రశ్నించారు. ఏపీలో ఫలితాలు అనుకున్నట్లే వచ్చాయని.. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకున్నారని విమర్శించారు. లిక్కర్ అంశంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలకు తేడా లేదని పేర్కొన్నారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియాతో తాడేపల్లి ప్యాలెస్‌కు లింక్ ఉందన్నారు.