TG: రైతుబంధు, రైతు రుణమాఫీ అమలు చేయకపోతే కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలను రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్న ప్రభుత్వం.. ఎంతమందికీ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే దళిత బంధు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో రెండవ విడత నగదును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.