రష్యా బలగాలతో కలిసి ఉత్తరకొరియా సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటానికి దిగుతున్నారనే వార్తలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఉత్తరకొరియా బలగాలను హెచ్చరించింది. రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా బలగాలు ఉక్రెయిన్‌లోకి వెళ్లితే.. వారి శవాలు బ్యాగ్‌ల్లో తిరిగి వెళ్తాయని వెల్లడించింది. ఈ మేరకు UNలోని అమెరికా డిప్యూటీ అంబాసిడర్ రాబర్డ్ వుడ్ దీనిపై మాట్లాడారు. ఒకటి, రెండుసార్లు అలోచించి బరిలోకి దిగాలంటూ సూచించారు.