AP: తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో DY.CM పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షపై పవన్ సోదరుడు నాగబాబు ట్వీట్ చేశారు. “నీ మతంతో పాటు సాటి మతాలని గౌరవించు, రక్షించు అని సమానత్వాన్ని చాటేదే సనాతన ధర్మం. ఆ ధర్మాన్నే పవన్ పాటిస్తాడు. అతనిని హిందువులు మాత్రమే కాదు, క్రైస్తవులు, ముస్లింలు కూడా ప్రేమిస్తారు. హిందూ ధర్మంలో ఉంటూ హిందూ ధర్మాన్ని చులకన చేసే సూడో సెక్యులర్ వాదులపైనే పవన్ పోరాటం. అర్థం చేస్కోగలరు” అని పేర్కొన్నారు.