TG: రాష్ట్రంలో గురుకుల పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన పాఠశాలలో అస్వస్థతకు గురై HYD నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. 11 నెలల్లో 36 మంది విద్యార్ధులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కాగా, గత నెల 30న 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.