AP: ఆలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలు పెంచుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ ప్రకటించారు. రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసే వారి వేతనాలు పెంచుతున్నట్లు చెప్పారు. ‘అర్చకులకు రూ.15 వేల వేతనం ఇవ్వాలని CM చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 3,203 మందికి లబ్ధిచేకూరనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.10 కోట్ల మేర అదనపు భారం పడనుంది. వేద పండితులు, వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి ద్వారా లబ్ధి కలుగుతుంది’ అని వెల్లడించారు.