మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు కురిపించారు. వాజ్‌పేయి బతికుంటే కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారేది కాదని చెప్పారు. ఆయన విధానాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించి ఉంటే కశ్మీర్ పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కశ్మీర్లో పరిస్థితిని మెరుగుపరచడానికి వాజ్‌పేయి ఎల్లప్పుడూ ప్రయత్నించారన్నారు.