AP: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం ఎంక్వైరీ అథారిటీని నియమించింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అభియోగాలు రావడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘన అభియోగాలపై ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించింది. విచారణాధికారిగా కడప కలెక్టర్‌ను నియమించింది. కేసు విచారణ చేసి ఎంక్వైరీ అథారిటీ నివేదిక సమర్పించాలని ఆర్డీవోను ఆదేశించింది.