వేదాంత గ్రూపుకు చెందిన హిందుస్థాన్ జింక్‌లో ప్రభుత్వం తన వాటాను విక్రయించనుంది. సంస్థలో 29.5 శాతం కలిగి ఉన్న కేంద్రం 2.5 శాతం వాటాను విక్రయించేందుకు నిర్ణియించుకుంది. దీంతో రూ.5వేల కోట్లకు పైగానే నిధులు సమీకరించనుంది. అయితే షేర్ల విక్రయాల్లో దాదాపు 10 శాతం డిస్కౌంట్ ఇస్తూ ఒక్కో షేర్ రూ. 505కే అమ్మనుంది.