TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలు మానుకోవాలని మంత్రి సీతక్క హితువు పలికారు. ఫుడ్ పాయిజన్తో అనారోగ్యం బారిన పడిన విద్యార్ధులను ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీమంత్రి హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు అసత్యమని ఆమె అన్నారు. ఆ ఘటనపై తమ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు.