VSP: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో యూటీఫ్, వివిధ సంఘాలు మంగళవారం విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో భేటీ అయ్యాయి. ప్రొఫెసర్ కేఎస్.చలం మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, దీనిని కాపాడుకోలేకపోతే రాబోయే కాలంలో దేశాభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. ఏ దేశమైనా ముందుకు కదలాలంటే విద్యారంగం కీలకమని అన్నారు.