AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురానున్నట్లు నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. అందుకుగానూ జీవో నం.77ను కేబినెట్ రద్దు చేయనుంది.