ASR: జిల్లా వ్యాప్తంగా వెయ్యి ఎకరాల్లో మల్బరీ సాగు విస్తరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఏడాదికి పది విడతల్లో పట్టు పరుగుల నుండి రైతులకు సుమారు రూ.లక్ష ఆదాయం వస్తోందన్నారు. మంగళవారం సెరీ కల్చర్ అధికారులతో సమావేశమయ్యారు. పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలో మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకాన్ని విస్తరించి రైతులకు ఆదాయం పెంచాలని సూచించారు.